- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానాల్లో వైర్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ప్రారంభించిన ఎయిర్ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తన విమానాల్లో సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణీకులు ప్రయాణ సమయంలో అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వైర్‌లెస్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను తీసుకొస్తున్నామని ఎయిర్ఇండియా ప్రకటించింది. మొదటి దశలో భాగంగా వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, 'విస్తా' పేరుతో బ్లూబాక్స్ వావ్ వైర్‌లెస్ నెట్‌వర్క్ సిస్టమ్ ద్వారా ఈ సేవలను అందించనున్నట్టు తెలిపింది. రియల్ టైమ్ ఫ్లైట్ ట్రాకింగ్ కోసం లైవ్ మ్యాప్‌ను విస్తా చూపిస్తుందని, వీటిని ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్, మ్యాక్స్ ఓఎస్, విండోస్ పరికరాల్లో వీక్షించవచ్చని పేర్కొంది. ఇందులో సినిమాలు, చిన్న పిల్లల కోసం వీడియోలు సహా 950 గంటలకు సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందని ఎయిర్ఇండియా వివరించింది. ప్రస్తుతానికి వైడ్-బాడీ విమానాల్లోనే ఈ సేవలు ఉన్నప్పటికీ త్వరలో చిన్న విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా వెల్లడించారు.