ఏఐ వల్ల ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐఎల్ఓ!

by Vinod kumar |
ఏఐ వల్ల ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐఎల్ఓ!
X

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా టెక్ రంగంలో ఉద్యోగులకు ఏఐ ఆందోళన పెరిగింది. ముఖ్యంగా గతేడాది ఆఖరులో వచ్చిన చాట్‌జీపీటీ రాకతో మొత్తం ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. ఆ తర్వాత అనేక కంపెనీలు తమ సొంత కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్‌ను తీసుకొచ్చాయి. దాంతో ఈ ఏఐ సాధనాల కారణంగా ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచేందుకు ఉపయోగపడుతుందని కొందరు భావించగా, చాలామంది తమ ఉద్యోగాలు పోతాయనే భయాన్ని వ్యక్తం చేశారు. పలువురు టెక్ దిగ్గజ కంపెనీల సీఈఓలు సైతం ఏఐ టూల్స్ కారణంగా ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా ఐక్యరాజ్య సమితీ అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) రూపొందించిన తాజా నివేదికలో ఐ సాధనాల కారణంగా ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కరలేదని తేల్చింది.

ఏఐ కేవలం పని విధానాన్ని మార్చగలదని, మనుషులను భర్తీ చేయలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని, పరిశ్రమలు పాక్షికంగా మాత్రమే ఆటోమేషన్ చెందుతాయని ఐఎల్ఓ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. చాట్‌జీపీటీ లాంటి టూల్స్ కారణంగా కంపెనీలు మేలు జరుగుతుంది. భవిష్యత్తులోనూ కొత్త టెక్నాలజీ కారణంగా ఉపాధి రంగం ప్రభావితం కాదు. నాణ్యమైన్ ఉద్యోగాలు, పనుల్లో మాత్రమే మార్పులు జరుగుతాయని నివేదిక పేర్కొంది. అయితే, ఈ కొత్త టెక్నాలజీ వల్ల పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చని నివేదిక అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed