DMart నికర లాభంలో 6 శాతం వృద్ధి

by Harish |   ( Updated:2023-01-14 13:22:44.0  )
DMart నికర లాభంలో 6 శాతం వృద్ధి
X

న్యుఢిల్లీ: దేశీయ అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 6 శాతం వృద్ధితో రూ. 590 కోట్లను నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 553 కోట్లుగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 25.5 శాతం వృద్ధితో రూ. 9,218 కోట్ల నుంచి రూ. 11,569 కోట్లకు పెరిగింది. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన (EBITDA) ఆదాయం రూ. 965 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 866 కోట్లుగా ఉంది. అయితే దీని మార్జిన్ 9.4 శాతం నుండి 8.3 శాతానికి తగ్గింది.

పన్ను తర్వాత లాభం క్రితం సంవత్సరంలో 6 శాతం తో పోలిస్తే ప్రస్తుతం 5.1 శాతంగా ఉంది. కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నోరోన్హా మాట్లాడుతూ.. FMCG, స్టేపుల్స్ సెగ్మెంట్ సాధారణ వస్తువులు, దుస్తులు విభాగాల కంటే మెరుగైన పనితీరును కొనసాగించాయి. కంపెనీ నాలుగు కొత్త నగరాల్లో తన ఇ-కామర్స్ కార్యకలాపాలను మరింత విస్తరించించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story