- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులకు గుడ్‌న్యూస్: మరో విడత PM-KISAN రూ.2 వేలు అకౌంట్లోకి వచ్చేది ఎప్పుడంటే!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. గత ఫిబ్రవరి నెలలో 13 వ విడత నిధులను విడుదల చేసిన కేంద్రం త్వరలో 14 వ విడత డబ్బులను అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తోంది. PM-KISAN 14 వ విడత రూ. 2000 లను ఏప్రిల్- జులై 2023 మధ్య విడుదల చేయవచ్చని సమాచారం. కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించనప్పటికి ఈ నెలల గ్యాప్‌లోనే డబ్బులను రైతులకు అందించనున్నారు.
రైతులకు పెట్టుబడి సాయంగా ఉండటానికి కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద, సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని విడతల వారీగా ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తుంది. ఇప్పటికే 13 వ విడత నిధులను రైతులకు అందించింది. అయితే కొంత మంది రైతలకు ఇప్పటికి ఈ డబ్బులు వారి అకౌంట్లలో జమ కాలేదు. e-KYC పూర్తి చేయని రైతులకు ఈ సమస్య ఎదురవుతుంది. కావున అర్హత కలిగిన రైతులు త్వరగా సరైన పత్రాలను సమర్పించి e-KYCని పూర్తిచేసి, తరువాత విడత డబ్బులను అయిన పొందాలని ప్రభుత్వం పేర్కొంటుంది.