- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వం కీలక నిర్ణయం.. బస్సులు బంద్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఏపీ బంద్‌కు పిలుపునివ్వగా.. ఈ నెల 26న భారత్ బంద్‌కి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పిలుపునిచ్చారు. గతంలో జరిగిన ఏపీ బంద్‌కి మద్దతిచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు భారత్ బంద్‌కి కూడా మద్దతిచ్చింది.
భారత్ బంద్‌కి మద్దతిస్తూ ఈ నెల 26న మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, నిరసనలు శాంతియుతంగా చేయాలని పేర్ని నాని తెలిపారు. అటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతరేకిస్తూ ఈ నెల 26న భారత్ బంద్‌కు రైతులు కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story