- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువుకు గండి – నీట మునిగిన పంటలు
X
దిశ,ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదివారం తెల్లవారు జామున మహ్మద్‌ఖాన్ చెరువుకు గండి పడింది. దీంతో నీరు వృథాగా పంట పొలాలపై నుంచి పారడంతో పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. చెరువు గండి పడడంతో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. చెరువు గండిని , నీట మునిగిన పంటలను గ్రామసర్పంచ్ శ్రీశైలం , మాజీ ఎంపీటీసీ రవి, ఎఈఓ విజయ్‌కుమార్ రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా మండలంలోని రామకృష్ణాపురం బ్రిడ్జిపై వరద నీరు జోరుగా ప్రవహిస్తుంది. మండలంలోని గట్టిప్పలపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన సఫీయా బేగం ఇంటి పై కప్పు కూలిపోయింది.
Advertisement
Next Story