పెట్రోల్, డీజిల్‌లపై అగ్రి సెస్!

by Harish |
పెట్రోల్, డీజిల్‌లపై అగ్రి సెస్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్-2021లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి, వేతజీవులకు బ్యాడ్ న్యూస్ ఇచ్చారు. ఇప్పటికే వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలను చూసి బెంబెలెత్తిపోతుంటే తాజాగా వీటిపై అగ్రి సెస్‌ను విధిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ అగ్రి సెస్ వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. దేశీయంగా పలు ప్రాంతాల్లో సెంచరీని కూడా దాటేసింది. కొత్తగా విధించిన ఈ అగ్రి సెస్‌తో ఈ రేట్లు మరింత భారం కానున్నాయి.

వ్యవసాయ రంగం అభివృద్ధి కోసమే ఈ కొత్త సెస్‌ను తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి చెబుతున్నప్పటికీ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కొత్త అగ్రి సెస్ వల్ల పెట్రోల్ లీటర్‌కు రూ. 2.50, డీజిల్ లీటర్‌కు రూ. 4 భారం వాహనదారులపై పడనుంది. కొత్త అగ్రి సెస్ తీసుకొస్తున్న కారణంగా ప్రస్తుతం అమ్మల్లో ఉన్న రెండు రకాల సెస్‌లను రద్దు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. కాబట్టి కొత్త సెస్ వల్ల భారం ఉండదని చెబుతున్నారు. అలాగే, ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీలను కూడా తగ్గించామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కొత్త సెస్ వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుతాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story