- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శానిటరీ నాప్కిన్లు తయారుచేస్తున్న అక్కాతమ్ముళ్లు
రుతుక్రమం… ఈ పదం ఇప్పటికీ భారతదేశంలో ఒక నిషేధ పదంగానే చలామణి అవుతోంది. ఇదేంటో అందరికీ తెలుసు. కానీ చర్చించడానికి మాత్రం జంకుతారు. మరీ ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల మధ్య కానీ, అక్కాతమ్ముళ్ల మధ్య కానీ ఈ టాపిక్ గురించి అసలు ఒక్క మాట కూడా ఉండదు. నిజానికి అలా మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు కూడా అంగీకరించరు. అలాంటిది అక్కతో కలిసి తమ్ముడు శానిటరీ నాప్కిన్ల తయారీకి సహాయపడుతున్నాడంటే ఆ కుటుంబం ఎంత ప్రోగ్రెసివ్ అనేది అర్థం చేసుకోవాలి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దగ్గరి మలిహాబాద్‌లో అనీషా, దీక్షా అనే ఇద్దరు 12వ తరగతి విద్యార్థినులు లాక్‌డౌన్‌లో శానిటరీ నాప్కిన్లు కూడా కొనుక్కోలేని పేదవారి కోసం నాప్కిన్లు తయారు చేస్తున్నారు. వీటి తయారీలో వారి అనీషా తమ్ముడు అనుమోల్, దీక్ష తమ్ముడు హిమాంశు కూడా సహాయం చేస్తున్నారు. అవి తయారు చేయాలంటే ముందు అవేంటో ఎందుకు వాడతారో ఎనిమిది తరగతి చదువుతున్న అనుమోల్, హిమాంశుకి పెద్దగా తెలియదు. కానీ వాళ్ల అక్కలు వారితో రుతుక్రమం గురించి మాట్లాడటానికి వెనక్కి తగ్గలేదు. తల్లిదండ్రుల అనుమతితో తమ్ముళ్లకు రుతుక్రమం వివరాలను, శానిటరీ నాప్కిన్ ఉపయోగాన్ని చెప్పి వారి పనిలో సాయం కోరారు. రుతుకమ్రం సహజ ప్రక్రియ కాబట్టి దీని గురించి మాట్లాడటానికి అందరూ ఎందుకు ఇబ్బందిపడతారో తనకు అర్థం కావడం లేదని అనీషా అంటుండగా, దాని విలువ తెలియని వారే అలా తప్పుగా అనుకుంటారని దీక్ష చెబుతోంది. వీరు తయారు చేసిన శానిటరీ నాప్కిన్లను యూత్ లీడర్‌షిప్ ఫౌండేషన్ ద్వారా వలసకార్మికుల్లో ఉన్న ఆడవాళ్లకు అందజేయబోతున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఇలా తమవంతు పనిగా ఇతరులకు సాయపడుతున్నందుకు ఆ నలుగురు అక్కాతమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు.