ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న బ్రిట్నీ స్పియర్స్‌ .?

by Shyam |
Britney-Spears
X

దిశ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కన్జర్వేటర్‌షిప్‌పై చర్చ జరుగుతూనే ఉంది. తండ్రి నుంచి పూర్తిగా ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్న స్పియర్స్‌కు అభిమానులు, సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తన లాంగ్‌టైమ్ మేనేజర్ లారీ రుడాల్ఫ్ స్టేట్‌మెంట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలో స్టేజీ మీద ఎంటర్‌టైన్ చేస్తుందనుకున్న ఫ్యాన్స్‌కు తన స్టేట్‌మెంట్ నిరాశ కలిగించింది.

25 ఏళ్లు మేనేజర్‌గా ఉన్న ఆయన.. తను రిజైన్ చేసేందుకు ఇదే సరైన సమయమని తండ్రి జామీ స్పియర్స్‌కు లెటర్ రాశాడు. స్పియర్స్ త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి వైదొలిగే అవకాశముందని, ఒకవేళ తను కంటిన్యూ చేస్తే మళ్లీ తనతో కలిసి పనిచేసేందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తన కెరియర్‌కు సహాయం చేసేందుకు బ్రిట్నీ అభ్యర్థన మేరకు తొలుత నియమించబడినట్లు తెలిపిన రుడోల్ఫ్.. మేనేజర్‌గా ఇకపై తన సేవలు అవసరం లేనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed