- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సక్సెస్ ఫుల్‌గా 32 కిలోల వేట్ లాస్.. తరలివచ్చిన 30 మంది అగ్నిమాపక సిబ్బంది
దిశ, ఫీచర్స్ : బ్రిటన్‌కు చెందిన జాసన్ హోల్టన్ 317 కిలోల హెవీ వెయిట్‌తో ఫ్యాటెస్ట్ బ్రిటనీగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే పది అడుగులు కూడా నడవలేకపోతున్న ఈ 31 ఏళ్ల వ్యక్తి.. గతేడాది నుంచి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ నిరాకరిస్తున్న వైద్యులు.. కొద్ది మొత్తంలో బరువు తగ్గితే ఆపరేషన్ చేస్తామని సూచించారు. ఆహారానికి బానిసగా మారిన అతడు.. బరువు తగ్గేందుకు రోజుకు 600 – 800 కేలరీల క్రాష్ డైట్‌ను స్వీకరిస్తూ 32 కిలోల బరువు తగ్గి, ప్రస్తుతం 285 కేజీలకు చేరుకున్నాడు.
జాసన్ ఇంత బరువు పెరిగేందుకు ‘టేక్ అవే ఫుడ్’ కారణమంటున్నాడు. ఏడాదికి గాను అతడి తిండి ఖర్చే దాదాపు రూ. పది లక్షలు కాగా.. ఆ ఫుడ్ ద్వారా రోజుకు 10,000 పైగా కేలరీలు పొందాడు. ఇక అతడు తీసుకునే ఆహారంలో.. తప్పనిసరిగా రెండు పెద్ద డోనర్ కబాబ్స్‌తో పాటు ఐదు లీటర్ల ఫిజీ డ్రింక్స్ ఉండాల్సిందే. ఈ క్రమంలో హెవీ వెయిట్ గెయిన్ చేసిన జాసన్.. గతేడాది అక్టోబరులో ‘లింఫోడెమా’ కారణంగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు 30 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇంజనీర్స్ బృందం ఏడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.
ఇక జాసన్‌కు ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు అందుతుండగా.. అతడి సౌకర్యార్థం అంతర్నిర్మిత బిడెట్‌తో స్పెషల్ టాయిలెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రాంట్ చెల్లించింది. ప్రస్తుతానికి తను టేక్‌అవే ఫుడ్ మానేసినా.. టెస్కో డెలివరీల కోసం వారానికి £100, సిగరెట్ల కోసం రోజుకు దాదాపు £10 ఖర్చు చేస్తున్నాడు. కాగా ప్రతి రోజు బరువు రోజూ చెక్ చేసుకునేందుకు గాను హెవీ-డ్యూటీ స్కేల్స్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం 32 కిలోల బరువు తగ్గడంతో అతడికి ఆపరేషన్ చేసేందుకు వైద్యులు అంగీకరించారు. ఈ మేరకు క్రిస్మస్ కానుకగా తన కొవ్వును కోల్పోయి నార్మల్‌గా తయారు కావాలని ఆశిస్తున్నాడు.