- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?

దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నం(Vishakhapatnam) సెంట్రల్ జైలు(Central Jail)లో ఓ ఖైదీ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న భూసరి రాజబాబు కేజీహెచ్‌లో(KGH) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. గతేడాది నవంబర్‌లో ఏజెన్సీలోని కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు.
ఈ క్రమంలో రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఈ తరుణంలో చికిత్స పొందుతన్న రాజాబాబు నిన్న(ఆదివారం) ఉదయం మరణించాడు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం.. జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్ ఆర్‌ఎంవో మెహర్‌కుమార్(Moharkumar) తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.