- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
నేడు తిరుపతిలో దేవాలయాల సమ్మిట్.. ముగ్గురు సీఎంల హాజరు!

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం(AP Government) పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూడా ప్రధాన దృష్టి పెట్టారు. ఈ ఏడాది పలు హామీలు అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. తిరుపతి(Tirupati)లో నేటి నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ దేవాలయాల(International temples) సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ(సోమవారం) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), మహారాష్ట్ర(Maharashtra), గోవా(Goa) సీఎం(Chief Minister)లు చంద్రబాబు(CM Chandrababu), ఫడణవీస్(CM Fadnavis), ప్రమోద్ సావంత్(CM Pramod Sawant), కేరళ గవర్నర్(Kerala Governor) రాజేంద్రప్రసాద్ అర్లేకర్(Rajendra Prasad Arlekar) పాల్గొననున్నారు. వీరు ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు ఆదివారం మంత్రులు(Ministers), ఎంపీలు(MPs), ఎమ్మెల్యేలు(MLAs), కూటమి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన స్ట్రైక్ రేట్ రిపీట్ అవ్వాలని కూటమి నేతలకు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని, కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని తెలిపారు. 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని, ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్లాలని కోరారు.