ఆస్పత్రి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ డిశ్చార్జ్

by vinod kumar |
ఆస్పత్రి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ డిశ్చార్జ్
X

లండన్: బ్రిటన్‌లో లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగత కొన్ని రోజులుగా ప్రధాని బోరిస్ జాన్సన్ డిశ్చార్జ్ అయ్యారు. ఐసీయూలో కరోనాకు చికిత్స తీసుకున్న ఆయన పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు వచ్చినా బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది. ఎట్టకేలకు బోరీస్ ఆరోగ్యం కుదుటపడటంతో ఆయనను ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా ఆయన మరి కొన్ని రోజులు బకింగ్‌హామ్‌షైర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటారని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. యూరోప్‌ను కబళిస్తోన్న కరోనా బ్రిటన్‌లో కూడా తీవ్ర ప్రభావం చూపింది. యువరాజు చార్లెస్ సహా ప్రధాని, ఆరోగ్య మంత్రి కూడా కోవిడ్-19 బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న ప్రధాని బోరీస్‌ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్ హెల్త్ సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్ పేర్కొన్నారు.

tags.. boris johnson, britain pm, discharged, ICU

Advertisement

Next Story