మా దేవుడి మీదే కేసు పెడతారా.?

by Shyam |
మా దేవుడి మీదే కేసు పెడతారా.?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా హీరో సోనూ సూద్‌కు 2021 సరిగ్గా ప్రారంభమైనట్లు లేదు. ఎందుకంటే తాజాగా సోనుపై ముంబైలో ఓ కేసు నమోదైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోనుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చాడని పేర్కొంది. కాగా ఈ భవనం ముంబైలోని కాస్ట్‌లీ ఏరియా జుహూలో ఉంది. ఈ వార్త విన్న అభిమానులు బీఎంసీపై మండిపడుతున్నారు. మా దేవుడి మీదే ఫిర్యాదు చేస్తారా అని ఫైర్ అవుతున్నారు. బీఎంసీ సోనును చూసి జలస్ ఫీలవుతోందని.. అయినా అది హోటల్ కాదని.. పేద ప్రజలకు షెల్టర్ ఇచ్చే ఆశ్రమం అని చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బీఎంసీని సపోర్ట్ చేస్తున్నారు. ఎంత యాక్టర్ అయితే మాత్రం ఇష్టమొచ్చినట్లు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story