మార్చురీలో కన్నతల్లి మృతదేహాం.. దిక్కులేని స్థితిలో చిన్నారులు..

by Disha News Web Desk |
మార్చురీలో కన్నతల్లి మృతదేహాం.. దిక్కులేని స్థితిలో చిన్నారులు..
X

దిశ, షాద్ నగర్: అనారోగ్యంతో కన్నతల్లి ఆసుపత్రిలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఈ హృదయవిధారకరమైన ఘటన షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫాతిమా అనే మహిళా ఎక్కడి నుంచో ఇద్దరు కూతుర్లు ఆసియా(8), రేష్మతో(6) పాటు వచ్చి షాద్ నగర్ పట్టణంలోని గంజ్ కూరగాయల మార్కెట్‌లో నివసిస్తుంది. కాగా ఇటీవలే ఫాతిమా అనారోగ్యానికి గురైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు చికిత్స తీసుకుని తిరిగి కూరగాయల మార్కెట్‌కు చేరుకునేది. అయితే, సోమవారం ఫాతిమా ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అక్కడే పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఫాతిమా మరణించింది. కన్నతల్లి కళ్ల ముందే శవమై మార్చురీలో పడున్నా.. ఎవరు లేక ఏం చేయాలో తెలియని దయనీయస్థితిలో ఆ పిల్లలు ఉన్నారు. ఫాతిమా సొంత ఊరు ఒక్కోసారి ఒక్కో గ్రామంగా చెప్పినట్లు తెలుస్తుంది. అనాథలుగా తల్లి శవం ముందు ఉన్న ఆ చిన్నారులను చూస్తే గుండె తరుక్కు పోతుంది.

Advertisement

Next Story

Most Viewed