రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట రుణమాఫీపై కీలక ప్రకటన

by samatah |   ( Updated:2022-03-07 07:08:36.0  )
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట రుణమాఫీపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురును అందించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో రూ.2.56 లక్షల కోట్లతోబడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతలకు అండగా ఉంటుందని చెబుతూ మంత్రి హరీష్ రావు పంట రుణ మాఫీపై కీలక ప్రకటన చేశారు. రూ.75 లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలను మాఫీ చేనున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story