- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగబాబు సంచలన నిర్ణయం.. పవన్‌కు షాకివ్వనున్నారా ?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో వివాదాలపై ఘాటుగా స్పందించే ఏకైక వ్యక్తి నాగబాబు. తాజాగా ఈ యన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ జర్నీ ఇలాగే సాగుతుంది అంటూ పెట్టిన ఈ పోస్ట్ పలు అనుమానాలకు దారి తీస్తోంది.
కాగా, ఆయన.. "ఎన్నో సంవత్సరాల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాను, నన్ను నేను మార్చుకోగలిగాను. ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఆపదలు, కష్టాలు నన్ను నేను పూర్తి మనిషిగా మార్చుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను, అదే గమ్యస్థానంలో నా లక్ష్యం వైపు బయలుదేరాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా.. ఈ కష్టాలు కూడా మనిషిగా ఎదగడానికి అప్పుడప్పుడూ అవకాశం ఇచ్చాయి. అందుకే ఇక నుంచి నా పూర్తి సమయాన్ని నా వైపు నా ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్న" అంటూ నాగబాబు సంచలన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నాగబాబు చేసిన ఈ పోస్టు చదివిన కొందరు ఈయన జనసేనకు రాజీనామ చేసి పవన్ కళ్యాణ్ కు షాకివ్వనున్నారేమో అంటూ ముచ్చటిస్తున్నారు. మరికొందరు నాగబాబు రాజకీయాలకు దూరమవుతున్నారా? సినిమాలకు దూరంగా ఉంటున్నారా..? తెలియాల్సి ఉంది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జనసేనకు రాజీనామా చేస్తున్నారా..? .. అని కొందరు.. పూర్తి రాజకీయ వేత్తగా మారుతున్నారా..? అని వ్యాఖ్యానిస్తున్నారు.