BREAKING : తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు..

by Shiva |
BREAKING : తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని మదురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో జల్లికట్టు పోటీలు ఇవాళ కాసేపటి క్రితం ప్రేక్షకుల హర్షధ్వానాల నడుమ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జనవరి రెండో వారంలో పొంగల్ పంట పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. వరుసగా మూడు రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగుతాయి. మొదటి రోజు అవనియాపురంలో, రెండో రోజు పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో ఈ పోటీలను నిర్వహిస్తారు. కాగా, కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియంను జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed