- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING : పుట్టపర్తిలో దారుణం.. ప్రభుత్వ అధికారిపై దుండగుల హత్యాయత్నం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పుట్టపర్తిలో దారుణం చోటుచేసుకుంది. భూగర్భ జలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి రాజశేఖర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో అధికారి రాజశేఖర్‌రెడ్డి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కింద పడిపోయారు. గమనించి కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సమీపంలో ఉన్న సత్యసాయి ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి జరిగిన తీరును పరిశీలించారు. తెలిసిన వాళ్లే దాడికి తెగబడ్డారా.. పాత కక్షలతో ఈ పని చేశారా, అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story