- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యుహాత్మాక ఆలోచలతో సవాళ్లు ఎదుర్కోవాలి.. ఐఎంఏ పాసింగ్ పరేడ్‌లో రాష్ట్రపతి
డెహ్రడూన్: బిపిన్ రావత్ లాంటి ధైర్యవంతులు వల్లే జాతీయ పతాకం పైపైకి ఎగురుతుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. డెహ్రడూన్‌లో ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో కేడేట్ల పాసింగ్ పరేడ్ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ఇక్కడే శిక్షణ పొందిన రావత్ వంటి ధైర్యవంతులు ఎల్లప్పుడూ దేశ గౌరవాన్ని కాపాడుతారని రాష్ట్రపతి అన్నారు. అలాంటి వారితో దేశ జెండా పైపైకి ఎగురుతుందని తెలిపారు.
‘387 మంది జెంటిల్‌మన్ క్యాడెట్‌లు త్వరలో తమ పరాక్రమం, వివేకంతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. స్నేహపూర్వక విదేశాలైన అఫ్ఘానిస్తాన్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, తజికిస్తాన్, టాంజానియా, తుర్క్మెనిస్తాన్, వియత్నాం కేడేట్లను కలిగిఉన్నందుకు భారత్ గర్విస్తుంది’ అని అన్నారు. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన వివరించారు.
దేశంలోని ఆధునిక ముప్పులను ఎదుర్కోవడానికి శారీరక, మానసిక దృఢత్వం మాత్రమే సరిపోదని అన్నారు. సైనిక నాయకులుగా వ్యుహాత్మాక ఆలోచనలు అమలు చేయాల్సి ఉంటుందని హితవు పలికారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న కేడేట్లకు ఆయన అభినందనలు తెలిపారు. దీంతో పాటు వారికి సరైన శిక్షణ ఇచ్చిన బోధకులను ప్రశంసించారు. అంతకుముందు విమానాశ్రయంలో దిగగానే గవర్నర్ రాష్ట్రపతిని జ్ఞాపికతో సత్కరించారు.