- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫీలో బట్టబయలైన ప్రియురాలి లీలలు.. లబోదిబోమన్న ప్రియుడు
దిశ,వెబ్‌డెస్క్: టెక్ యుగంలో సెల్ఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం… వచ్చే లైకులు, కామెంట్ల కోసం ఎదురు చూడడం క్రేజీగా మారింది. అలా ఓ ప్రేమికుడు తీసుకున్న సెల్ఫీతో ప్రియురాలు తనని మోసం చేస్తున్న విషయాన్ని గమనించాడు. ప్రియురాలు చేసిన మోసానికి సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు.
కెన్ వాంగ్ చైనాలో బాగా ఫేమస్. ఒక్క సెల్ఫీతో సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ఓ రోజు కెన్ వాంగ్ తన ప్రియురాలి బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెస్ చెప్పాలని.. ఆమె ఉండే ప్రాంతానికి ఫ్లవర్ బొకేతో వెళ్లాడు. అంతకంటే ముందే బర్త్ డే సందర్భంగా ప్రియురాలికి ప్లవర్ బొకే ఇస్తున్నానంటూ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీలో కెన్వాంగ్ వెనకాల కొంత దూరంలో ఉన్న అతడి ప్రియురాలి లీలలు బయటపడ్డాయి. మరో యువకుడితో క్లోజ్ గా ఉన్న దృశ్యాలు కంటపడ్డాయి. అంతే ప్రియురాలి మోసంతో కన్నీరుమున్నీరయ్యాడు.
అనంతరం ఈ రోజు నా ప్రియురాలి బర్త్ డే. నేను ఆమెకు బొకే ఇచ్చేందుకు వచ్చా. కానీ తను వేరే యువకుడితే క్లోజ్ గా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.