- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోరిక తీర్చాలంటూ వేధింపులు.. ఒప్పుకోకపోవడంతో అంత పని చేసిన దుర్మార్గుడు.. ( వీడియో)
దిశ, ఏపీ బ్యూరో: పచ్చని సంసారంలో ఓ కామాంధుడు చిచ్చు పెట్టాడు. కోరిక తీర్చాలంటూ గిరిజన మహిళను వేధించాడు. అయితే అందుకు ఆ మహిళ అంగీకరించకపోవడంతో నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎంతలా వేధించినా అందుకు ఆ మహిళ కోరిక తీర్చకపోవడంతో ఆమె భర్తకు లేనిపోనివి చెప్పి కాపురాన్ని నాశనం చేశాడు. దీంతో తన కాపురాన్ని నిలబెట్టాలంటూ సదరు బాధితురాలు సోషల్ మీడియా వేదికగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కల్లూరు గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే గిరిజన మహిళను కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. అందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. అయినా లొంగకపోవడంతో అతడు ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన భర్త ఆమెను దూరం పెట్టాడు. అంతేకాదు విడాకులు తీసుకుంటానని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు బోరున విలపించింది. తనపై లేనిపోని మాటలు చెప్పి తన భర్తను తనకు దూరం చేశాడని.. కన్నీటి పర్యంతమైంది.
ప్రస్తుతం తాను గర్భవతినని తనకు అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ న్యాయం చేయాలని ఆమె కోరుతూ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు ఎవరి అండదండలు లేవని ఈ కారణంతోనే నవీన్ తనను వేధిస్తున్నాడని.. ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె విలపించింది. కలెక్టర్, ఎస్పీ తన జీవితాన్ని కాపాడి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు వేడుకుంది.