ఒత్తిడి తగ్గించే బాక్స్ బ్రీతింగ్

by sudharani |
ఒత్తిడి తగ్గించే బాక్స్ బ్రీతింగ్
X

ఉరుకుల పరుగుల జీవితం, అసమయ భోజనాలు, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా మనుషుల శరీరం రోగాల పుట్టగా తయారవుతోంది. ఇవి రాకుండా ఉండటానికి రోజు పొద్దున్నే వ్యాయామం చేయాలని అందరికీ తెలుసు. కానీ పొద్దున లేవడానికి బద్ధకం, అలాంటిది వ్యాయామం కూడానా. ఉదయాన్నే పదిహేను నిమిషాలు కాస్త ఎక్కువ నిద్రపోవడానికి ఏం త్యాగం చేయడానికైనా జనాలు సిద్ధంగా ఉన్న ఈరోజుల్లో వ్యాయామం చేయాలంటే చాలా అంకితభావం కావాలి. దానికి తోడు వ్యాయామం చేయడానికి ఖర్చుతో కూడుకున్న సెటప్ ఒకటి పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా కేవలం చిన్న చిట్కాతో ఒత్తిడిని పోగొట్టుకునే అవకాశం ఒకటి కొత్తగా ట్రెండవుతోంది. దీన్నే బాక్స్ బ్రీతింగ్ అంటారు.

ఎలా చేయాలి?

దీన్ని చేయడానికి ప్రత్యేక సెటప్ అక్కర్లేదు. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చివరికి ప్రయాణంలో ఉన్నా ఈ బాక్స్ బ్రీతింగ్ చేయవచ్చు. కాకపోతే కదలకుండా కూర్చోవడానికి కొద్దిగా స్థలం కావాలి. ముందుగా కళ్లు మూసుకుని, ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చాలి. ఆ గాలి ఊపిరితిత్తులలోకి వెళ్తున్న విధానాన్ని అనుభూతి చెందాలి. తర్వాత రెండు ముక్కుల మూసి నాలుగు సెకన్ల పాటు (కేవలం నాలుగు సెకన్లే) గాలిని లోపలే ఉంచాలి. తర్వాత నెమ్మదిగా ముక్కు ద్వారా మాత్రమే గాలిని నాలుగు సెకన్ల పాటు వదలాలి. ఇలా నాలుగు సార్లు, రోజుకి రెండు పూటలు చేస్తే సరిపోతుంది. అంతే… ఇదే బాక్స్ బ్రీతింగ్.

ఉపయోగాలేంటి?

బాక్స్ బ్రీతింగ్ చేయడం వల్ల ఒత్తిడి కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తుంది. మానసిక స్పష్టత రావడమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది. భుజాలు, మెడ భాగంలో కలిగే భౌతిక ఒత్తిడిని తగ్గిస్తుంది. భవిష్యత్తులో ఒత్తిడి కారణంగా కలిగే డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. జీవితాన్ని ఏకాగ్రతతో సాగించే విధానాన్ని అలవడేలా చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed