- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం
దిశ, ఫీచర్స్ : ప్రపంచ దేశాల్లో వజ్రాల కోసం నిరంతరం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఆఫ్రికా దేశాల్లో ఈ తరహా గనులకు ప్రసిద్ధి. అయితే గనుల నుంచి వజ్రాలను వెలికితేసేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ఆయా దేశాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో లభించిన ‘కుల్లినన్’ వజ్రమే అతిపెద్దది కాగా, రెండోదాన్ని బొత్సవానాలో వెలికితీశారు. తాజాగా 1108 క్యారెట్ల వజ్రం కూడా అక్కడే బయటపడగా.. దీన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రంగా భావిస్తున్నారు.
ఆంగ్లో అమెరికన్స్ (ఏఏఎల్.ఎల్) డి బీర్స్, బొత్సవానా ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో ఈ వజ్రాన్ని కనుగొన్నారు. ఈ వజ్రాలను విక్రయించే ‘డెబ్‌స్వానా డైమండ్ కంపెనీ’ సదరు వజ్రాన్ని బొత్సవానా ప్రెసిడెంట్ మోక్‌వీట్సికి బహూకరించినట్టు సంస్థ యాక్టింగ్ మేనేజర్ లినెట్ ఆర్మ్ స్ట్రాంగ్ తెలిపారు. ఇక దక్షిణాఫ్రికాలో 1905లో వెలికితీసిన ‘కుల్లినన్’ 3106 క్యారెట్లతో ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా కొనసాగుతుండగా.. ఆ తర్వాత వందేళ్లకు 2015లో బొత్సవానాలో లభించిన ‘లుకారా’ డైమండ్ 1109 క్యారెట్లతో రెండో ప్లేస్ దక్కించుకుంది. కాగా ప్రస్తుతం దొరికిన 1108 క్యారెట్ల ‘లెసేడి లా రోనా’ మూడో అతిపెద్ద డైమండ్ అయిఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా వజ్రాల వ్యాపారంలో 50 ఏళ్లుగా సేవలందిస్తున్న డెబ్‌స్వాన్ కంపెనీ చరిత్రలో.. ఇదే అతిపెద్ద వజ్రమని కంపెనీ మేనేజర్ ఆర్మ్‌స్ట్రాంగ్ వెల్లడించారు. తమ ప్రాథమిక విశ్లేషణలో వరల్డ్‌లోనే నాణ్యత గల మూడో అతిపెద్ద వజ్రం ఇదేనని స్పష్టతకు వచ్చామన్నారు. కాగా ఈ వజ్రం 73మిమీ పొడవు, 52 మిమీ వెడల్పు, 27 మిమీ మందం ఉందని తెలిపిన ఆ దేశ మినరల్స్ మినిస్టర్ లొఫోకో మోగి.. కొవిడ్ 19 పాండమిక్ తర్వాత వజ్రాల అమ్మకాలు ఆశాజనకంగా లేవన్నారు. ఇక వజ్రాల అమ్మకాల ద్వారా డెబ్‌స్వానా సంస్థకు వచ్చే ఆదాయంలో 80 శాతం.. డివిడెంట్లు, రాయల్టీలు, పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లనున్నాయి. పైగా పాండమిక్ పరిస్థితుల వల్ల 2020లో సంస్థ ఉత్పత్తులు 29 శాతానికి పడిపోయాయి. ఈ క్రమంలో అమ్మకాలు కూడా 30 శాతానికి తగ్గినట్టు వెల్లడించారు.