‘జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే’

by srinivas |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇద్దరూ దొంగలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. జగన్ ప్రపంచంలోకెళ్లా అత్యంత అవినీతి పరుడని విమర్శించారు. అలాగే, తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడి జరుగుతుందని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నారయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ ఉగ్రవాద బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిశీల భావజాలం ఉన్నవారందరిపైన దాడులు పెరిగాయనీ, ప్రభుత్వాల ఆత్మన్యూనతాభావంతోనే ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed