- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక క్యాబ్ బుకింగ్ మరింత సులభతరం!
క్యాబ్ బుకింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం మరింత సులభతరంగా మారింది. అయితే ఇప్పుడు క్యాబ్ బుక్ చేయాలంటే స్మార్ట్‌ఫోన్ కావాలి, అందులో యాప్ ఉండాలి. కొద్దో గొప్పో ఇంగ్లీషు తెలుసుండాలి, అలాగే ఎలా బుక్ చేయాలో ఐడియా ఉండాలి. లేదంటే తప్పు క్యాబ్ చేసి, అటు డ్రైవర్లను ఇబ్బంది పెట్టి, ఇటు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది.
ముఖ్యంగా టెక్నాలజీ ఎలా వాడాలో తెలియని వారి కోసం ప్రముఖ క్యాబ్ సర్వీసు సంస్థ ఊబర్ ఓ కొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. నిజానికి ఇది పాత పద్ధతే కానీ వాడటం మానేశారు. ఈ పద్ధతిలో క్యాబ్ బుక్ చేసుకోవడానికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. మామూలు ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు. దీని ద్వారా ఊబర్ వారి నెంబర్‌కి కాల్ చేసి, ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళ్లాలో చెబితే.. వారు ఎంత అవుతుందో, ఎవరితో వెళ్లాలో చెప్పి క్యాబ్ బుక్ చేస్తారు.
ఇది కొద్దిగా పాతకాల పద్ధతిలాగే అనిపించినా.. ముఖ్యంగా వయోవృద్ధులకు, టెక్నాలజీ తెలియని వారికి ఈ విధానం ఉపయోగకరంగా ఉండబోతోంది. అయితే ప్రస్తుతానికి ఈ విధానాన్ని ఒక రాష్ట్రంలో ప్రవేశపెట్టి, అక్కడి ఫలితాలను బట్టి దేశమంతటా, తర్వాత ప్రపంచమంతటా ఊబర్ అమలులోనికి తీసుకురానుంది.