గవర్నర్ నిర్ణయం కోర్టులో నిలువదు

by srinivas |   ( Updated:2020-07-31 08:26:41.0  )
గవర్నర్ నిర్ణయం కోర్టులో నిలువదు
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించినా.. కోర్టులో నిలవదని టీడీపీ నేత బోండ ఉమ అన్నారు. ప్రభుత్వం ఈ బిల్లులను దొడ్డిదారిన గవర్నర్‌కు పంపి ఆమోదించుకుందని దుయ్యబట్టారు. దీనిపై టీడీపీ న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు.

‘‘జగన్ అధికారంలోకి వచ్చి ఏదాడి దాటింది. పరిపాలనలో ఏం వెలగబెట్టారని అడుగుతున్నా. విశాఖలో ఇప్పటి వరకు పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్రలో రోడ్డు వేశారా? రాయలసీమలో ప్రాజెక్ట్ కట్టారా? మూడు రాజధానులు కడతాం మన ప్రభుత్వ చర్య తుగ్లక్ పాలనను మించింది’’ అని ఉమ విమర్శించారు.సీఎం జగన్ మూడు రాజధానులు కావాలి అనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి రాజధానుల అంశం మీదే ఎన్నికలకు వెళదాం అని సవాల్ విసిరారు. ప్రజలు మళ్లీ మీకు పట్టం కడితే, మూడు రాజధానుల మీద ముందుకు వెళ్లండి అని బోండా ఉమ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed