- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో ఈటల, కేకే ప్రత్యేక పూజలు.. మాటిచ్చిన కిషన్ రెడ్డి
దిశ, చార్మినార్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున కిషన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నగర మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బంగారు బోనం సమర్పించారు. అనంతరం రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.కేశవరావ్, మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌లు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అందుకు కృషి చేస్తా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని గుర్తుచేశారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి భాగ్యనగరంలో అత్యంత వైభవంగా అమ్మవారి బోనాల పండుగను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారన్నారు.