అమ్మకు తొలి బోనం సమర్పణ

by Shyam |   ( Updated:2021-07-26 03:46:57.0  )
అమ్మకు తొలి బోనం సమర్పణ
X

దిశ, చార్మినార్ : ఆషాఢమాసం బోనాల ఉత్సవాల ను పురస్కరించుకుని జంగమెట్ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ నిర్వాహకుడు, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాతృ మూర్తులకు పర్వతాల రాజేందర్ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సదా మణిశంకర్, అశోక్, కిరణ్, మహేందర్, ఉదయ్, లక్ష్మణ్, మహేష్, శివకుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed