- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్‌లో కూడా ‘విక్రమ్ వేద’ కష్టమేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : తమిళ్‌లో సూపర్ సక్సెస్ సాధించిన సినిమా విక్రమ్ వేద. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని విజయం సాధించింది. 2017లో గాయత్రి పుష్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పోలీస్ విక్రమ్‌గా మాధవన్, నెగెటివ్ రోల్ వేదగా విజయ్ సేతుపతి నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
సైలెంట్‌గా సక్సెస్ అయిన ఈ వయొలెంట్ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామని ఎప్పటినుంచో ప్లాన్లు జరుగుతున్నాయి. రవితేజ, రానా లీడ్ రోల్స్‌లో ఈ పోలీస్ గ్యాంగ్ స్టర్ డ్రామాని రీమేక్ చేద్దామని డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం ఈ సినిమాపై మనసు పడ్డారు .
కెరీర్‌లో ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ చేసే అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ విక్రమ్ వేదని రీమేక్ చేద్దామనుకున్నారు. తమిళ్‌లో డైరెక్ట్ చేసిన గాయత్రి, పుష్కర్ డైరెక్షన్లోనే ఈ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. కానీ అమీర్ ఖాన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి విత్ డ్రా అయినట్టు న్యూస్ వినబడుతోంది. అదే నిజమైతే సైఫ్ అలీఖాన్‌తో పాటు అమీర్‌ని రీప్లేస్ చేసే హీరో ఎవరా అని డిస్కషన్స్ మొదలయ్యాయి బాలీవుడ్ లో. అమీర్ ఖాన్ తప్పుకుంటే ఇంతకు ఈ మూవీ బాలీవుడ్ లో పట్టాలెక్కుతుందా..? లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.