- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బోట్' కంపెనీలో భారీ పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: ఇయర్‌ఫోన్, స్పీకర్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విక్రయిస్తున్న దేశీయ బ్రాండ్ బోట్ తాజాగా రూ. 731 కోట్ల నిధులను సమీకరించింది. దీంతో బోట్ కంపెనీ విలువ సుమారు రూ. 2,100 కోట్లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది.
ముఖ్యంగా కన్జ్యూమర్ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయిస్తున్న బోట్ గత కొన్నేళ్లుగా చైనాతో పాటు ఇతర దేశాల బ్రాండ్‌లతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. కొత్త పెట్టుబడులతో దేశీయంగా తయారీని మరింత పటిష్టంగా మార్చి వృద్ధిని సాధించగలమని బోట్ ప్రమోటర్లు సమీర్ మెహతా, అమన్ గుప్తా తెలిపారు. ఇటీవల కేంద్రం అమలు చేసిన ఉత్పత్తి అనుసంధాన పథకంలో భాగంగా ఉత్పత్తులను తయారు చేయనున్నట్టు, దేశీయంగా సరికొత్త ఉత్పత్తులను తీసుకురానున్నట్టు బోట్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న వాటిని రాబోయే రెండు మూడు త్రైమాసికాల్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెడతామని వెల్లడించింది. గతేడాది తొలి త్రైమాసికం ప్రారంభంలో బోట్ కంపెనీ రూ. 700 కోట్ల టర్నోవర్‌ను సాధించిందని, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ. 1000 కోట్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశాలున్నాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.