ఆడవేషంలో విమానంలోకి.. వాష్ రూమ్ లో అలా కనిపించి

by vinod kumar |   ( Updated:2021-07-23 04:08:57.0  )
ఆడవేషంలో విమానంలోకి.. వాష్ రూమ్ లో అలా కనిపించి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా కరోనా నియమనిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యం కరోనా సోకినవాఋ ప్రయాణాలు చేయకూడదని, స్వీయ నిర్బంధనలోనో, ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని తెలిపింది. కరోనా సోకినవారు ప్రయాణాలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఓ వ్యక్తి విమానం ఎక్కడానికి అతి తెలివి ప్రదర్శించి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. తన భార్యలా వేషం మార్చుకొని ఆమె గుర్తింపు కార్డులను అడ్డుపెట్టుకొని విమానమెక్కాడు. ఈ వింత ఘటన ఇండోనేషియా విమానంలో జరిగింది.

వివరాలలోకి వెళితే.. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తి జకార్తా నుంచి టెర్నేట్‌కు విమానంలో వెళ్లాలనుకున్నాడు. కానీ, కరోనా.. లోపలికి వెళ్లాలంటే కరోనా రిపోర్ట్ చూపించాలి, పాజిటివ్ అని తెలిస్తే లోనికి రానివ్వరు. అందుకని తెలివిగా ఆ వ్యక్తి అతని భార్యలా మారిపోయాడు. బురఖా ధరించడంతో పాటు భార్య గుర్తింపు కార్డులు, ఆమెకు సంబంధించిన కొవిడ్‌ నెగటివ్‌ ధ్రువపత్రం వెంట తీసుకుని విమానాశ్రయానికి చేరుకున్నాడు. ముందస్తుగా టికెట్‌ కూడా భార్య పేరు మీదే బుక్ చేశాడు. చెకింగ్ సమయంలో అతడిని విమాశ్రయ అధికారులు కనిపెట్టలేకపోవడంతో అతడు విమానం ఎక్కాడు. ఇక నాథా సవ్యంగా జరుగుతోంది అనుకొనేలోపు ఒక చిన్న పొరపాటు చేశాడు.

విమానం బయల్దేరే సమయంలో అతడు వాష్ రూమ్ కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు బురఖా తో వెళ్లిన అతను తిరిగివచ్చేటప్పుడు యాధాలాపంగా పురుషుడిగా బయటికి వచ్చాడు. ఈ విషయాన్నీ అక్కడున్న ఒకరు అది గమనించి అధికారులకు చేరవేయడంతో అయ్యగారి గుట్టురట్టయింది. దీంతో విమానం లాండ్ అవ్వగానే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కరోనా టెస్టులు చేయడంతో అతడికి పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడిని క్వారంటైన్‌ లో ఉంచారు.

తొడలు మందంగా ఉన్నాయే.. హీరోయిన్‌పై కామెంట్స్

Advertisement

Next Story