సిద్ధిపేటలో ఓ అద్భుతం

by Anukaran |   ( Updated:2020-07-29 02:16:33.0  )
సిద్ధిపేటలో ఓ అద్భుతం
X

దిశ, సిద్ధిపేట: సూర్యోదయంతో వికసించేది తామర పుష్పం అయితే, చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగింది ఒక్క బ్రహ్మ కమలం మాత్రమే. టిబెట్, దక్షిణ చైనా ప్రాంతాల్లో కనిపించే బ్రహ్మకమలం దక్షిణాది రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో మాత్రమే బ్రహ్మ కమలం పువ్వుగా మారుతుంది.

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మెదక్ రోడ్డు ప్రశాంతి నగర్ లో నివాసం ఉంటున్న సుతారి రమేష్ నిర్మల దంపతుల స్వగృహంలో ఉన్న బ్రహ్మకమలం మొక్క మొదటిసారిగా మంగళవారం రాత్రి పుష్పం వికసించడంతో ప్రజలు పూజలు నిర్వహించారు. అన్ని పూల మొక్కల కాండాలకు మొగ్గలు ఎదిగి పుష్పాలుగా వికసిస్తే బ్రహ్మకమలం మాత్రం ఆ తీగకు ఉండే ఆకు నుండి ఉద్భవించడం మరో విశేషం. మంగళవారం రాత్రి వికసించిన బ్రహ్మ కమలం బుధవారం ఉదయానికి తిరిగి మొగ్గ దశకు చేరుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా భగవంతుడు సృష్టించిన లీలాగా అభివర్ణిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed