- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేంజర్.. టవేరా వెహికిల్ నిండా పేలుడు పదార్థాలు..
దిశ, పటాన్‌చెరు : లైసెన్స్ లేని పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అమీన్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసులు రెడ్డి కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం 10.00 గంటలకు అమీన్ పూర్ SI పి.ప్రసాద్ పోలీసు సిబ్బందితో కలిసి అమీన్ పూర్ మండలంలోని శ్రీవాణి నగర్ కోకకోలా కంపెనీ ముందు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఒక టవేరా వాహనంలో ఇద్దరు వ్యక్తులు దున్నపోతుల నాగరాజు (21) బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్ధి, వరికుప్పల నవీన్ (21) ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా 9 కాటన్ల పేలుడు పదార్థాలు (జిలెటిన్ స్టిక్స్), 24 కట్టల డిటోనేటర్లను వరంగల్ నుంచి అమీన్ పూర్‌లో గల కన్స్ట్రక్షన్ సైట్ల వద్దకు తీసుకొని వెళుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇండ్ల నిర్మాణాలలో పెద్ద పెద్ద బండ రాళ్ళను సులువుగా పగులగోట్టడానికి అవసరమైన వారికి ఎలాంటి లైసెన్స్ లేకుండా దొంగ చాటుగా సప్లై చేస్తామని తప్పును ఒప్పుకున్నారు. ఈ మేరకు టవేరా వాహనాన్ని, పేలుడు పదార్థాలను సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ పేర్కొన్నారు.