- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బ్లాక్ ఫంగస్ మరణాలు : ఎన్ఎస్‌యూఐ
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ 19, బ్లాక్ ఫంగస్ వ్యాధులపై ప్రభుత్వం సరైన అవగాహనలు కల్పించలేకపోయిందని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరు ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే మరణాలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లను విధించడం వలన వ్యాధులపై ప్రజలకు ఎలాంటి అవగాహన రాదని తెలిపారు. ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలను ఎన్ఎస్‌యూఐ తరుఫున చేపట్టామని చెప్పారు. ప్రముఖ వైద్య నిపుణులతో, ఈఎన్‌టీ స్పెషలిస్టులతో, పిడియాట్రీషియన్లతో అవగాహన సెమినార్లను చేపట్టాలని వివరించారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవాలని జనరల్ సర్జన్ హేమలత తెలిపారు. వ్యాధి లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌లో ఉంచి సాచురేషన్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. పోస్ట్ కొవిడ్ రోగుల్లో ముక్కు, తలనొప్పి, దంత నొప్పి, చెంప మీద వాపు, కంటి వాపు, బుగ్గలపై నల్ల మచ్చలు, అంగిలి వంటి లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ వ్యాధిగా గుర్తించాలని ఈఎన్‌టీ డాక్టర్ రోహిత్ స్టీఫెన్ తెలిపారు. డయాబెటిక్ రోగులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సింగిల్ మాస్క్‌ను ఎక్కువగా వినియోగించడం మంచిది కాదని తెలిపారు.
పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు హై గ్రేడ్ జ్వరాలు, దద్దుర్లు, కడుపు నొప్పి, కండ్లకలక వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని పిడియాట్రిక్ డాక్టర్ రాహుల్ డేవిడ్ తెలిపారు. పిల్లలకు సరైన హైడ్రేషన్‌ను, పోషకాహారాలను అందించాలని సూచించారు.