- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షూ పాలిష్ చేస్తూ బీజేవైఎం నిరసన

X
దిశ ప్రతినిధి, వరంగల్ : నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేవైయం నేతలు వరంగల్‌లో షూ పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం వరంగల్ బీజేవైఎం అధ్యక్షుడు సిద్ధం నరేష్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాటసారుల చెప్పులను, షూస్‌ను శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాలపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 33 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. హుజురాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story