ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి : జగన్ సర్కార్‌కి బీజేపీ వార్నింగ్

by srinivas |
ap
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసంతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి కష్ట కాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో పన్నుల పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పన్నులు పెంచుతుంటే ప్రజలు ఓట్లతో గెలిసిన ఎమ్మెల్యే లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త పన్నులు వేయాలంటే ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పన్నులు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed