‘ఆ మర్డర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేయించాడు’ : Dharmapuri Arvind

by Shyam |   ( Updated:2021-05-25 06:56:09.0  )
‘ఆ మర్డర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేయించాడు’ : Dharmapuri Arvind
X

దిశ, బాల్కొండ: బీజేపీ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న సిద్దార్థ్‌ను చూసి ఓర్వలేక మంత్రి ప్రశాంత్ రెడ్డి హత్య చేయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు. బాల్కొండలో మంగళవారం మృతుడి కుటుంబీకులను పరామర్శించిన ఆయన హత్య చేసింది టీఆర్ఎస్‌ నాయకులే అని ఆరోపించారు. ఇదే నియోజకవర్గంలో గంజాయి దందాను మంత్రి తమ్ముడు యథేచ్చగా సాగిస్తుంటే.. అందుకు ప్రశాంత్ రెడ్డి అన్ని రకాలు సాయం చేస్తున్నాడన్నారు. హత్య చేసిన నిందితుడికి జైల్లో బిర్యానీలు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని అర్వింద్ చెప్పారు. జైల్లో ఉన్న వ్యక్తి ఫేస్‌బుక్ స్టేటస్‌లు ఎలా మార్చుతున్నాడని ప్రశ్నించారు. పోలీసులు టీ‌ఆర్‌ఎస్‌ (TRS) తొత్తులుగా మారవద్దని.. నిందితుడికి జైల్లో సహకరిస్తున్న సీఐ, ఎస్‌ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed