‘అఖండ-2’ టీజర్‌కు మూహుర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ ఆ స్పెషల్ డే నాడే వచ్చేస్తుంది! (ట్వీట్)

by Hamsa |
‘అఖండ-2’ టీజర్‌కు మూహుర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ ఆ స్పెషల్ డే నాడే వచ్చేస్తుంది! (ట్వీట్)
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవల ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీసును షేక్ చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ-2’(Akhanda-2). బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ విరామం లేకుండా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఇక దీనికి సంబంధించిన షూటింగ్ మహా కుంభమేళాలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ‘అఖండ-2’ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే...తాజాగా, బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెలరోజుల షెడ్యూల్ కోసం మూవీ టీమ్ వచ్చే నెలలో జార్జియాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మే నెల మొత్తం జార్జియాలోనే షూటింగ్ జరుపుకోనున్న ‘అఖండ’టీజర్ బాలయ్య బర్త్ డే జూన్ 10న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన బాలయ్య అభిమానులు ఆనంద పడుతున్నారు.



Next Story