- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రదాడికి పాల్పడిన టెరర్రిస్టు వీళ్లే.. ఊహా చిత్రాలు విడుదల

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam) మంగళవారం ఉగ్రదాడి (Terrorist attack) జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతకీ దుర్మార్గపు చర్యకు పాల్పడి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టులను (Terrorists) గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమైనాయి. ఈ నేపథ్యంలోనే నలుగురు ఉగ్రవాదులు ఊహ చిత్రాలను భారత సైన్యం (Indian Army) తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం వీరి కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రదారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.
అలాగే, దాడి జరిగిన ప్రాంతంలోనే నక్కిన నలుగురు టెర్రరిస్టుల్లో ఒకరి పేరు ఆదిల్ గురీ అని తెలుస్తోంది. అతడు పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చి 2018లో విదేశాలకు పారిపోయాడని అధికారులు గుర్తించారు. మరొక ఉగ్రవాదిని ఆసిఫ్ షేక్‌గా గుర్తించారు. దాడులు జరిగినప్పుడు వైరల్ అయిన అనేక ఫుటేజీల్లో వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు కనిపిస్తున్నాయని.. దాన్ని ఆధారంగా చేసుకునే వీరిని గుర్తించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
కాగా, ఏకే 47 తుపాకీ చేత పట్టుకొని బైసరన్ ప్రాంతంలో దేశ విదేశీ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 2019లో జరిగిన పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదే. ఆరుగురు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.