- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కీలక నేతకు 'సొంత' చిక్కులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఢిల్లీ స్థాయిలో చక్రాలు తిప్పుతున్న ఆ మాజీ ఎంపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్నారా..? సీక్రెట్ గా సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తున్నారా? సొంతింట్లోనే ఆ మాజీ ఎంపీకి వ్యతిరేకంగా జట్టు కట్టే పనిలో నిమగ్నం అయ్యారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఏమా పార్టీ అంటే మీరీ స్టోరీ చదవాల్సిందే.
ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ కు గల్లీలో మాత్రం వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే ఆయన బాధిత వర్గం, సీనియర్ బీజేపీ కేడర్ అంతా కలిసి రహస్య సమావేశం నిర్వహించుకుంటున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణలతో పాటు ఏడు సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు ఈ రహస్య సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మొదట మంచిర్యాల కేంద్రంలో జరపాలని నిర్ణయించుకున్నప్పటికీ మీడియాకు లీక్ కావడంతో వేదిక మార్చినట్టు సమాచారం. తాము పార్టీ సీనియర్ నాయకుని ఇంట్లో జరిగే కార్యక్రమానికి మాత్రమే హాజరయ్యాం తప్ప మరోటి లేదని మీడియాతో వ్యాఖ్యానించినప్పటికీ లోగుట్టు మాత్రం వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది.
టార్గెట్ వివేక్…
పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా పనిచేసిన జి వివేక్ పార్టీ సీనియర్ కేడర్ ను కాదని ప్యారలల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాడని సీనియర్ నాయకులు, ఇతర బాధ్యులు కూడా మనో వేదనకు గురవుతున్నారు. గత జనవరిలోనే తాను రాజీనామా చేస్తానని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి లేఖ రాసినట్టుగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. తరువాత ముత్తారం మండలానికి చెందిన ఓ నాయకునితో సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ వివేక్ ఒంటెద్దు పోకడలు తనకు నచ్చడం లేదని చెప్పారు. తనకు సంబంధం లేకుండా వేరే మీటింగ్ లు ఏర్పాటు చేయడం కూడా మంచి పద్ధతి కాదని సోమారపు సత్యనారాయణ వివరించిన ఆడియో టేపు కూడా అప్పట్లో కలకలం సృష్టించింది. దశాబ్దాల కాలంగా పార్టీతోనే అనుబంధం పెనవేసుకున్న వారికి కూడా గుర్తింపు లేకుండా పోవడం కూడా సీనియర్లను భాధిస్తోంది. దీంతో వీరంతా కలిసి సమావేశం అయి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకుంటున్నట్టుగా సమాచారం.
అయితే తాము ఎలాంటి మీటింగ్ లు పెట్టలేదని వ్యతిరేక వర్గం నాయకులు చెప్తున్నప్పటికీ.. వారు మాత్రం తమ పంథాను ఎంచుకునే పనిలోనే పడ్డారని విశ్వసనీయంగా తెలిసింది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించి, జాతీయ స్థాయి నాయకులతో కలిపించే పనిలో నిమగ్నమైన వివేక్ కు సొంత నియోజకవర్గంలో మాత్రం వ్యతిరేకత రావడం విశేషం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు, సర్వేలు చేయించడం వంటి బాధ్యతలను భుజాన వేసుకుని మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు వివేక్. అంతేకాకుండా టీఆర్ఎస్ వ్యతిరేక కూటములను తమ పార్టీవైపు తిప్పుకునే పనిలో నిమగ్నం అయిన వివేక్ కు.. సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నడిపించడం చర్చనీయాంశంగా మారింది.