- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యా.. కేసీఆర్ రైతుల బాధలు పట్టవా : పొంగులేటి సుధాకర్
దిశ, పాలేరు: కూసుమంచి మండలం పాలేరులో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి రైతుల ధాన్యపు రాసులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రైతుల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాల పేరుతో డ్రామాలడుతున్నడని విమర్శించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఉండే డబ్బులు రైతులకు ఇవ్వడానికి లేవనడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఆరువేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా పదిహేను వందల కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని మిగతావి కూడా వెంటనే ఏర్పాటు చేయాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలన చేతకాని పక్షంలో తప్పుకుంటే కేంద్రమే చూసుకుంటుందన్నారు. అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు మాట్లాడే భాషను మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. వ్యవసాయ చట్టాలను ఆనాడు సపోర్ట్ చేసిన కేసీఆర్ ఈనాడు వ్యతిరేకించడం హాస్యాస్పదమని కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, దొంగల సత్యనారాయణ, మండల అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పాలేరు ఇంచార్జ్ మేక సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హట్యా నాయక్, బెల్లం మురళి, సీతారాములు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనంత్ ఉపేందర్ గౌడ్, మంగి రెడ్డి, దాసరి వెంకటేశ్వర్లు, రాసాల రవి, దామల ప్రభాకర్,పో టు భద్రయ్య,బోడేపూడి రాజా,దుద్దుకూరు కార్తీక్,నాగ లింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.