- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ నేత ఫ్యామిలీ పై కాల్పులు..
దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో బీజేపీ నేత ఫ్యామిలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నేత షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..షేక్ వసీం, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ సోమవారం రాత్రి తమ దుకాణంలో పనిచేసుకుంటున్నారు. అదే సమయంలో బైక్ పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌కు 10 మీటర్ల దూరంలోనే జరిగినట్లు సమాచారం.
బీజేపీ నేత కుటుంబంపై అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. అలాగే ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామన్నారు.కాగా, షేక్ వసీమ్‌కు 10 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. కాల్పుల సమయంలో ఒక్కరు కూడా అక్కడ లేరు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొత్తం 10 మంది భద్రతా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతుడు షేక్ వసీమ్ గతంలో బండిపోరా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. విషయం తెలుసుకున్న ప్రధాన నరేంద్ర మోదీ ఉగ్ర చర్యలను ఖండించారు. వసీమ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.