మాకు అధికారం ఇస్తే.. ఏ సమస్య లేకుండా చూస్తాం

by srinivas |
మాకు అధికారం ఇస్తే.. ఏ సమస్య లేకుండా చూస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: మాకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానుల విషయంలో తమ వైఖరేంటో ఇప్పటికే తెలిపామని అన్నారు.

తాము దేశంలో అధికారంలో ఉండటంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో సంక్షిష్టమైన సమస్యలు పరిష్కరించామని తెలిపారు. మాకు అధికారం ఇస్తే ఏ సమస్య లేకుండా చూస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. ఏపీలో బీజేపీ ఎదుగుతుందేమోనని కుట్రలు చేస్తున్నాని విమర్శించారు.

ఏపీలో 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో బీజేపీకి స్పష్టత ఉందని తెలిపారు. ఆరు పోర్టులు కడితే ఏపీ అమెరికాలా తయారవుతుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed