- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో మహిళపై బీజేపీ నేత లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన కేసు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కోండ నియోజకవర్గంలోని ఓ శివారు మండలం బీజేపీ నేత కిచక ఉధంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు సదరు బీజేపీ నేతకు దేహశుద్ధి చేశారు. శనివారం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో వ్యాపారం నిర్వహించే మండల బీజేపీ నేత కన్ను స్థానికంగా ఉండే వివాహితపై పడింది.
ఆమెను లొంగదీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అదే విధంగా శనివారం కూడా వేధింపులకు పాల్పడంతో సదరు మహిళ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ క్రమంలో సదరు మహిళతో పాటు మహిళ కుటుంబ సభ్యులు అతని షాపులోనే కామాంధుడిని చితక బాదారు. బాధిత మహిళ అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. అయితే సదరు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు కేసును వాపసు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
సదరు నేతకు రాజకీయ పలుకుబడి ఉండటంతో పోలీసులు సైతం కేసును నీరు గార్చేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే సదరు మండల స్థాయి బీజేపీ నేత అంటే పార్టిలోనే క్యారెక్టర్ లేస్‌గా చెబుతున్నారు. అతడు ఎవరికీ గౌరవం ఇవ్వడని దానికి తోడు పొగరు ఎక్కువ అని పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సదరు కమలం పార్టీ నేతకు 2019లో ఇదే మాదిరిగా మహిళను వేధించడంతో బడిత పూజా చేశారని తెలిసింది. ఆ నేత తీరుపై పార్టీ నేతలు ఇది వరకే ఎంపీ అర్వింద్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికైనా అతనిపై బీజేపీ అగ్రనేతలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.