ఆ మార్క్‌ను దాటేసిన రఘునందన్ రావు

by Shyam |   ( Updated:2020-11-10 11:36:53.0  )
ఆ మార్క్‌ను దాటేసిన రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీజేపీ షాక్ ఇచ్చింది. హరీష్ రావు దత్తత గ్రామంలో బీజేపీ టీఆర్ఎస్‌పై 22 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అలాగే ఉత్తమ్ ఇన్చార్జ్ గా ఉన్న లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్‎కు కేవలం 163 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి 520 ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 490 ఓట్లు పోలయ్యాయి.

దుబ్బాక ఉప ఎన్నికల్లో గత 2018 ఎన్నికల ఓట్ల మార్కును బీజేపీ అభ్యర్థి మాదవనేని రఘునందన్ రావు దాటేశారు. గత ఎన్నికల్లో 22,595 రాగా, ఈ ఉప ఎన్నికల్లో 10వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి మొత్తం 31,783 ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల్లో 15,133 ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థి సాధించారు.

కాగా పదో రౌండ్‌లో బీజేపీకి 31,783, టీఆర్ఎస్‌కు 28,049, కాంగ్రెస్‌కు 6,699 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 3734 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 7404 ఓట్లను లెక్కించారు. నోటాకు 283 ఓట్లు పడ్డాయి.

Advertisement

Next Story