- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ వాళ్లు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా..?
దిశ ప్రతినిధి, వరంగల్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్లతో దాడి చేస్తే తప్పులేదు.. కానీ, మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేస్తే నాన్ బెయిల్ కేసులు పెడతారా.. ఇదెక్కడి న్యాయం అంటూ బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పోలీసుల తీరును ఖండించారు. మిల్స్ కాలనీ పోలీసులు ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆమె బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం వరంగల్ ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడిని ఖండిస్తూ మేము ధర్నాలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచి పంపించారన్నారు. అదే విధంగా ఎంపీ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేసిన టీఆర్ఎస్ వ్యక్తులను వెంటనే ఎలా వదిలి పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. నిన్న అరెస్ట్ చేసిన మా కార్యకర్తలను సైతం వదిలిపెట్టాలని లేకుంటే తదుపరి చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.