బీజేపీ పుంజుకుంటోంది : భాను ప్రకాశ్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-11-12 01:15:45.0  )
బీజేపీ పుంజుకుంటోంది : భాను ప్రకాశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో పాలించే అధికారాన్ని జగన్ ప్రభుత్వం కోల్పోయింది అని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారు అని విమర్శించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తాం అని అన్నారు. ఎలాగైన గెలిచి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఏపీలో బీజేపీని లేకుండా చేస్తామన్న టీడీపీ నేతలు పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి దుబ్బాక విజయమే నిదర్శనం అన్నారు. వైసీపీ విధ్వంసకర పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed