కథ, స్క్రీన్‎ప్లే అంతా హరీశ్ రావుదే..!

by Shyam |
కథ, స్క్రీన్‎ప్లే అంతా హరీశ్ రావుదే..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సిద్దిపేట ఘటన మంత్రి హరీశ్ రావు దర్శకత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి బాబుమోహన్ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‎లో నిరసన దీక్ష చేస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‎ను బాబుమోహన్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావే పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించారని విమర్శించారు. హరీష్ రావు చిన్న పిల్లాడిలాగా ఫ్రస్టేషన్‎కు గురై మాట్లాడుతున్నారన్నారు. ఆడవాళ్లు, పిల్లలు అని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు.

ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని, సిద్దిపేట, గజ్వేల్‎లాగా దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలేదని బాబు మోహన్ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని కళ్లెర్ర జేస్తే మీరు జైల్లో ఉంటారు.. జాగత్త అని హెచ్చరించారు. హుందాగా ఉండాల్సిన సీపీ అత్యుత్సాహం చూపించారని, నిన్నటి ఘటనపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Advertisement

Next Story