- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోని ముస్లిములంతా కలిస్తే 4 పాకిస్థాన్ల ఏర్పాటు.. భగ్గుమన్న బీజేపీ!
దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ రాజకీయాలు ఓట్ల కోసం ప్రజలను రెండు వర్గాలుగా చీలుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. బీజేపీ ఎప్పటిలాగే మెజార్టీ వర్గంపై కన్నేయగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ మైనార్టీ ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ నేత ఒకరు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. వాటిని బూచిగా చూపించి బెంగాల్లో మెజార్టీ ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ కొత్త వ్యుహాలు పన్నుతోంది.
తాజాగా టీఎంసీ నాయకుడు షేక్ ఆలం బుధవారం ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత దేశంలోని 30 శాతం ముస్లిములు కలిసి వస్తే నాలుగు పాకిస్తాన్ లు ఏర్పాటు చేయవచ్చునని అన్నారు. మనం 30 శాతం ఉంటే.. ఇంకో వర్గం వారు 70శాతం ఓట్లతో అధికారం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వారంతా సిగ్గుపడాలి.. అని టీఎంసీ నాయకుడు వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. సీఎం మమతా బెనర్జీ ఇన్నిరోజులు మైనార్టీ సంతృప్తికరమైన రాజకీయాలు చేయడం వల్లే టీఎంసీ నాయకులు ఇలాంటి దేశవిద్రోహ కామెంట్స్ చేస్తున్నారని బీజేపీ లీడర్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తంచేశారు.